- 44 కార్మిక చట్టాలను 4 భాగాలుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ సమ్మెలు చేసుకునే హక్కులను నిర్వీర్యం చేయడం ఆందోళనకరం..సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి.ఆంజనేయులు,సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాగనూరు,ఫిబ్రవరి 16:- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ):
మాగనూర్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా హై స్కూల్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదిగా పురవీధుల గుండ ర్యాలీ నిర్వహించి అంతరాష్ట్ర రహదారిపై రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కో కన్వీనర్ పి ఆంజనేయులు,సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ లో భాగంగా పురవీధుల గుండా వివిధ రంగాల కార్మికులు అంగన్వాడి,ఆశా,మధ్యాహ్నం భోజనము వర్కర్స్ వి వో ఏ గ్రామపంచాయతీ,వి వో ఏ లకు కనీస వేతనం 26,000/- ఇవ్వాలని,ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని,పిఎఫ్,ఈఎస్ఐ ఉద్యోగ భద్రత,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి,కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ సామాన్య ప్రజల కార్మిక కర్షక హక్కులపై దాడి చేస్తుందన్నారు.మాటల్లో జాతీయత ఆచరణలో విదేశీ జపం చేస్తుంది దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్మేస్తుందన్నారు.44 కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తూ సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కులను కాలరాస్తూ మరోపక్క కార్పొరేటు మతతత్వ విధానాలను అమలు చేస్తూ కార్మికుల కర్షకుల దేశ ప్రజల జీవితాలతో ఆటలాడుతూ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు.కార్మికులు కర్షకులు రైతులు దేశ ప్రజలందరూ గమనించి మతోన్మాదం బిజెపి విధానాలను ఎండగట్టాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉద్యోగులు శివకుమారి,తులసి,సునీత,రాగసుధ,మంజుల,మధ్యాహ్న భోజన కార్మికులు జి.ప్రమీల,శంకరమ్మ,లక్ష్మీ దేవమ్మ, బాబు,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు శాంతమ్మ,గౌరమ్మ,అనురాధ,కృష్ణవేణి,సత్యమ్మ,గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు అశోక్,కార్యదర్శి నాగేష్,వెంకటప్ప,గుడేబల్లూర్ శీను,సంగమ్మ,మారెమ్మ,వివో ఎ ల సంఘం నాయకులు ఎం.రవి బాబు,సిపిఎం పార్టీ నాయకులు జి.నరేష్, బి.నర్సింలు,ఎస్.అంజనేయులు, వాకిటి వెంకటయ్య,భాస్కర్,రాఘవేంద్ర,ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కె.నరసింహ సాకేత్ తదితరులు పాల్గొనడం జరిగింది
కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
74
previous post