మంచిర్యాల, ఫిబ్రవరి 15, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): సి ఎస్ సి ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్ష పక్షులు శిబిరం నిర్వహించారు. గురువారం సిఎస్సి ఆరోగ్య సంస్థ ఉచిత రక్త పరీక్షలు శిబిరం యువశక్తి యూత్ అసోసియేషన్ సమక్షంలో లేబర్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న కార్మికులందరికీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించడం జరిగిందని యువశక్తి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మర్రిపల్లి శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పొనకల్ మెాజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రక్కన కార్మికశాఖ అధ్వర్యంలో సిఎస్సి ఆరోగ్యం సంస్త అధ్వర్యంలో యువశక్తి యూత్ సమక్షంలో లేబర్ కార్డ్ ఉన్నా కార్మికులందరికి ఉచిత రక్తపరీక్షలు శిభిరం నిర్వహించబడిందని, ఈ ఉచిత రక్త పరీక్ష శిభిరములో సుమారు 30-40రకాల రక్త పరీక్షలు ఉచితముగ చెయ్యడం జరుగుతుందన్నారు. ఈ ఉచిత రక్త పరీక్ష శిబిరానికి 100కు పైగా మంది రక్త పరీక్షలు నిర్వహించుకున్నారని తెలిపారు. సి ఎస్ సి హెల్త్ కేర్ మంచిర్యాల జిల్లా సమన్వయకర్త కొండలరావు, సుగుణ దినేష్ సుమలత రక్త పరీక్షలు నిర్వహించుటలో వైద్యుల సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో యువశక్తి యూత్ ఉపాధ్యక్షుడు కుదురుపాక పవన్ కళ్యాణ్, ప్రచార కార్యదర్శి బోయిని శేఖర్, కోశాధికారి దాసరి సతీష్, ప్రచార కార్యదర్శి ఐలవేని నర్సయ్య, యువశక్తి యూత్ అసోసియేషన్ సభ్యులు అంజయ్య, రఫీక్, రవి, సురేష్, రాజన్న, శ్రీనివాస్, గ్రామస్తులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సిఎస్ సి ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్త పరీక్షల శిబిరం
66