శేరిలింగంపల్లి,ఫిబ్రవరి 15(తెలంగాణ ఎక్సప్రెస్ ):
శేరిలింగంపల్లి నియోజిక వర్గం లోని మియాపూర్ డివిజన్ లో ఎంసీపీ ఐ (యు )పార్టీ స్టాలిన్ నగర్ కమిటీ సభ్యురాలు కామ్రేడ్ ఈశ్వరమ్మ గురువారం ఉదయం గుండెనొప్పితో హాస్పటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు .
కామ్రేడ్ ఈశ్వరమ్మ 1997 స్టాలిన్ నగర్ ఏర్పాటు చేసినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలలో,ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూ వచ్చింది. చివరగా బుధవారం అమరజీవి కామ్రేడ్ తాండ్ర కుమారు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా జరిగిన ర్యాలీ సదస్సులో కూడా ఆరోగ్యంగా చురుగ్గా పాల్గొంది. స్టాలిన్ నగర్ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరితో కుటుంబ సభ్యురాలుగా ఉంటూ సుపరిచితులైన కామ్రేడ్ ఈశ్వరమ్మ పార్టీవదేహంపై పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ పార్టీ శ్రేణులతో కలసి పార్టీ ఎర్ర జెండా కప్పి జోహార్లు అర్పిస్తూ. ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు. వారిలో గ్రేటర్ హైదరాబాద్ నాయకులు తాండ్ర కళావతి,కుంభం సుకన్య,పి భాగ్యమా, ఎ పుష్ప, మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇ. దశరథ్ నాయక్, డివిజన్ నాయకులు డి నర్సింహా, గూడ లావణ్య, జి శివాని, దార లక్ష్మి,ఎండి సుల్తానా బేగం, నాగభూషణం, టి నర్సింగ్, పార్టీ నాయకులు ఎండి రజియా బేగం,ఎం రాణి, తుడుం పుష్పలత,శ్రీలత, ఎం మాధవ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.