Home తాజా వార్తలు ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

by Telangana Express

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15(తెలంగాణ ఎక్సప్రెస్ ):

బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ని నడిగడ్డ తండాలో గిరిజన సంక్షేమ సంఘం నడిగడ్డ తండా ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ మహారాజ్ 250సంవత్సరాల క్రితమే బంజారాలను జాగృతం చేసి సక్రమైన మార్గంలో నడవాలని చెడు అలవాట్లు మద్యం, మాంసాహారం మొదలగు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు అని అలాగే స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని అదికూడా అడవి ప్రాంతంలో చేరువు, ఏరు, నది వంటి సకల వసతులు చూసుకొని స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని బాల బ్రహ్మ చరిగా అఖండ భారత దేశం అంతా తిరిగి బంజారాలను జాగృతం చేసిన అధ్యత్మాకత కలిగిన సాక్ష్యత్తు విశ్వరుడి అవతారం అని బంజారా గిరిజనులు కొలుస్తారు అని వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , డాక్టర్ రాంసింగ్ , మోహన్ ముదిరాజ్ , బస్తీ వాసులు స్వామి నాయక్, తిరుపతి నాయక్, హన్మంతు నాయక్, సీతారాం నాయక్,తుకారాం నాయక్,దశరత్ నాయక్ గోపి నాయక్,లక్సమన్ నాయక్, కృష్ణ నాయక్, చందు, హరి నాయక్, ఈస్వార్, శ్రీను నాయక్, కృష్ణ నాయక్,సుధాకర్, కమలాకర్, ఈస్వార్,బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment