పినాకిల్ విద్యాసంస్థ అధినేత మదార్
మిర్యాలగూడ డివిజన్ ఫిబ్రవరి 15 తెలంగాణ ఎక్స్ ప్రెస్: నేరేడుచర్ల పట్టణం పినాకిల్ పాఠశాలలో వేలాది సంవత్సరాల చరిత్ర సాంస్కృతిక వైవిధ్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని, సర్వ సంస్కృతుల నేల ఇండియా అని,మత సహానాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయటం కోసం గురువారం “సంస్కృతి” పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యం,సంగీతం వేష ధారణ,తమ కళలు, మాండలికాల ద్వారా చరిత్ర, సంస్కృతిని తెలియజేశారు.ఈ సందర్భంగా పినాకిల్ విద్యాసంస్థ అధినేత మదార్ మాట్లాడుతూ… నేటి కాలంలో చాలామంది చరిత్ర సంస్కృతి గత కాలపు అవశేషాలుగా చూస్తున్నారు అని,అవి మన నుండి వేరుగా పరిగణిస్తున్నారని అన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ఇవన్నీ కనుమరుగవుతున్నాయి అని,మన ముందున్న తరం వారి పునాదులపై నిర్మించబడ్డాయని మరిచిపోకూడదనే ఉద్దేశంతో, మన స్వంత విలువలు, నైతికత ను మెచ్చుకుంటూ, సంస్కృతి వారసత్వాన్ని సంరక్షించడం ప్రజలు,చరిత్ర వారి జీవితాలలో ప్రాముఖ్యత ను నేటి తరాలకు అనుసంధానించడం కోసం, ఆ మూలాలు సజీవంగా ఉంచడం కోసం ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది అని, అలాగే గతం భవిష్యత్ కు పునాది అని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పినాకిల్ విద్యాసంస్థ అధినేత మదార్ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, ప్రియమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.