లోకేశ్వరం ఫిబ్రవరి 15(తెలంగాణ ఎక్స్ ప్రెస్) లోకేశ్వరం మండల కేంద్రంలో 4.5 లక్షలతో మంజూరైన డ్రైనేజీ పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ ముధోల్ నియోజకవర్గం ఇంచార్జ్ నారాయణరావు పటేల్ ప్రారంభించారు. ముందుగా స్థానిక గజ్జలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడకుండా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మన నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు వచ్చే అవకాశాలను సద్వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మామిడి నారాయణరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, ఆనందరావు పటేల్, బెజ్జంకి ముత్తం రెడ్డి, పండరి గౌడ్, భోజరాం పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సుదర్శన్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, రామచంద్రరావు,సాయినాథ్,రాథోడ్ శ్రీనివాస్, మహమ్మద్ షఫీ, ఎర్రన్న, మాజీ సర్పంచులు ముత్త గౌడ్, ఎల్లన్న, నరేష్, నాయకులు కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు
