శ్రీ సరస్వతి శిశు మందిర్ వీణవంక
వీణవంక, ఫిబ్రవరి 14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో బుధవారం వసంత పంచమి పర్వదినాన శ్రీ సరస్వతి మందిర్ విద్యాలయంలో 22 మంది పిల్లలకు సామూహిక విద్యాభ్యాసం చేయించడం జరిగింది. అనంతరం సరస్వతి మాత కటాక్షం కొరకు హోమం నిర్వహించడం జరిగింది. శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయంలో నూతనంగా శిశు వాటికను ఏర్పాటు చేయగా, కోర్కోల్ గ్రామానికి చెందిన నార్ల వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రబంధ కాలనీ అధ్యక్షులు జోజుల ప్రహ్లాద రావు, సమితి కార్యదర్శి అయిత రాంబాబు, ప్రబంధకారిణి సభ్యులు వెన్నంపల్లి నారాయణ, పూర్వ విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.