వైద్యుల నిర్లక్ష్యం అంటున్న బంధువులు..
జమ్మికుంటలో హాస్పిటల్ ఎదుట ఆందోళన…
జమ్మికుంట/ వీణవంక, ఫిబ్రవరి14( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళితే వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామానికి చెందిన మ్యాడగోని మానస( 24), రెండవ కాన్పు డెలివరీ కొరకు జమ్మికుంట పట్టణంలోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ కాగా , మంగళవారం అర్ధరాత్రి పండంటి జన్మ మగబాబుకు జన్మనిచ్చిందని, కానీ, మానస డెలివరీ అయిన తర్వాత సీరియస్ గా ఉందని హనుమకొండకు తరలించాలని డాక్టర్లు సూచించగా, వెను వెంటనే తరలించడం జరిగిందని, మార్గమధ్యంలో మానస మరణించడం జరిగిందని, మానస మృతికి కారణం మత్తు డాక్టర్ సుధాకర్ రావు, డాక్టర్లు రాణి, రాము లే కారణమని , మానస భర్త ప్రశాంత్ ఆరోపించారు. మృతురాలి కుటుంబ సభ్యులు మానస మృతదేహంతో జమ్మికుంట లోని శ్రీరామ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు.