మిర్యాలగూడ ఫిబ్రవరి 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నల్లగొండ జిల్లా సివిల్ సప్లై స్టేజ్ సెకండ్ టెండర్లను రీకాల్ చేసి.. తనకు టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని మిర్యాలగూడ పట్టణానికి చెందిన గజ్జి అమృతవల్లి మధుసూదన్ కోరారు. మిర్యాలగూడలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ సివిల్ సప్లై స్టేజ్ సెకండ్ టెండర్ల లో పాల్గొనే విషయంపై తనకు కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ.. రేషన్ డీలర్ భార్య అయిన కారణంగా వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. పాత కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో సంబంధిత శాఖల అధికారులు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. తనకు ఆలస్యంగా టెండర్లలో పాల్గొనే అవకాశం ఇవ్వడంతో అప్పటికే సమయం ముగిసిపోయిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల జిల్లా అధికారులు స్పందించి సివిల్ సప్లై స్టేజ్ సెకండ్ కు టెండర్ వేసుకునే అవకాశం తనకు కల్పించాలని అమృతవల్లి కోరారు.