Home తాజా వార్తలు ఖమ్మంలో మార్చి 3,4,5 లలో జరిగే జాతీయ మహాసభలు కరపత్రాలు విడుదల

ఖమ్మంలో మార్చి 3,4,5 లలో జరిగే జాతీయ మహాసభలు కరపత్రాలు విడుదల

by Telangana Express
  • సిపిఐ ఎంఎల్ (ప్రజపంథా) మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యుడు పురం శెట్టి బాపు

మంచిర్యాల, ఫిబ్రవరి 09, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మార్చి 3,4,5 లలో జరిగే జాతీయ కరపత్రాలను, మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, చింతగూడ గ్రామంలో సిపిఐ ఎంఎల్ (ప్రజపంథా)కమిటి సభ్యుడు పురంశేట్టి బాపు విడుదల చేశారు. మంగళవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండల ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ మహసభలను విజయవంతం చేయాలని కోరారు. భారతదేశంలో 14 రాష్ట్రాలలో విస్తరించి పిసిసి సిపిఐ ఎంఎల్, సిపిఐ ప్రజాపంథా ఎమ్ఎల్ రివల్యూషనరీ, ఇనిషియేటివ్ మూడు జాతీయ పార్టీలు విలీనమై, మాస్ లైన్ పార్టీలుగా ఏర్పడుతున్న సందర్భంగా మార్చి 3,4,5 లలో ఖమ్మంలో జరిగే ఐక్యత జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జాతీయ పార్టీలు ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బిజీఎన్ఆర్ కాలేజీ నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. మార్చి 4,5 భక్తి రామ కళాక్షేత్రంలో భక్తి రామ కళాక్షేత్రంలో 500 మంది జాతీయ ప్రజాప్రతినిధుల సభ నిర్వహించడం తెలిపారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజపంథా పార్టీలు నిర్వహించే పార్టీల జాతీయ ఐక్యత మహాసభలకు వేలాది మంది తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ మంచిర్యాల జిల్లా నాయకుడు మల్లేష్ గౌడ్, మున్నయ్య, పోషక్క, పద్మ, రజత, తదితరులు పాల్గొన్నారు.

జెఎసి ఆధ్వర్యంలో మంచిర్యాలలో సనహాక సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 15 కార్మిక సంఘాలు సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గానికి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, టిఎన్ టి యుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు టీ మణి రామ్ సింగ్, సిఐటియు జిల్లా అధ్యక్షులు సంఖ్య రవి, ఏఐటియుసి నాయకులు మేకల దాసు, ఐఎన్టిసి నాయకులు హెచ్ ఎం ఎస్ నాయకులు, తదితర కార్మిక నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొని సనహక సదస్సును విజయవంతం చేయాలని కోరారు.

You may also like

Leave a Comment