వీణవంక,ఫిబ్రవరి13( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిది )
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన డుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందగా, మంగళవారం ఘన్ముక్ల గ్రామానికి చెందిన గాజుల హరిత(ట్రాన్ జెండర్)మృతుని కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన వంతు సాయం గా, మానవత దృక్పథంతో రూ.5వేలు మృతుని కుటుంబానికి అందించి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు , గ్రామస్తులు రఘువరన్ తదితరులు ఉన్నారు. గొప్ప మనసుతో ఆర్థిక సహాయం అందించిన ట్రాన్ జెండర్ హరితను గ్రామస్తులు ప్రశంసించారు.