- రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను శాలువాతో సన్మానించిన జన్నారం పట్టణ అధ్యక్షుడు ఆడెపు లక్ష్మీనారాయణ
మంచిర్యాల, ఫిబ్రవరి 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): రాష్ట్రంలోని నలుమూలల నుండి పద్మశాలీలు ఒకే చోట చేరి రాష్ట్ర పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని నియమించుకున్నారు.
హైదరాబాదులోని తెలంగాణ పద్మశాలి భవన్ లో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులుగా కామార్థపు మురళి, ప్రధాన కార్యదర్శిగా మాచర్ల రామచందర్రావు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను కామవర్దపు మురళి, మాచర్ల రామచంద్రరావు రాష్ట్ర పద్మశాలి సంఘం భవనంలో ఆదివారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల పట్టణ అధ్యక్షుడు అడెపు లక్ష్మీనారాయణ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పద్మశాలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పద్మశాలీ లకు సరైన గుర్తింపు, పతకాలు గానీ అందడంలో ప్రభుత్వం వెనుకంజు వేస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర పద్మశాలి సంఘం కలిసికట్టుగా నడిచి హక్కులను రక్షించుకుందామని తెలిపారన్నారు. రాష్ట్ర పద్మశాలి సంఘం నియమకానికి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వేరు సదానందం. దండేపల్లి మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు శంకర్, జైపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు శుాభాకాంక్షలు తెలియజేశారన్నారు.