మంచిర్యాల, ఫిబ్రవరి 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మార్కండేయ జయంతిని మంచిర్యాల జిల్లా పట్టణంలోని లక్ష్మీ నగర్ కాలనీలో పద్మశాలి సేవా సంఘం సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ నగర్ కాలనీలో భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మార్కండేయుని జయంతి సందర్భంగా మార్కండేయ మహా రుషి చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ ఋషి సంస్కృతి పద్మశాలీల కుల దైవమైన భక్త మార్కండేయ మహా ఋషి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, నాయకులు బోస్ బూర్ల దామోదర్, అడిచర్ల రాజేశం, బూర్ల జ్ఞాని, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మార్కండేయ జయంతిని నిర్వహించిన పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ
56
previous post