Home తాజా వార్తలు అంబేద్కర్ కాలనీలో సీసీ రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం

అంబేద్కర్ కాలనీలో సీసీ రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం

by Telangana Express
  • స్థానిక ప్రజా ప్రతినిధుల అండదండలతో నిర్మాణం చేపట్టే ప్రయత్నం
  • ప్రభుత్వ ఆస్తిని కాపాడి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు ఫిర్యాదు
  • అంబేద్కర్ కాలనీ వాసులు

ఆమనగల్లు, ఫిబ్రవరి 11
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ప్రభుత్వం కాలనీ ప్రజల సౌకర్యార్థం వేయించిన సీసీ రోడ్డున ఆక్రమించి స్థానిక ప్రజా ప్రతినిది అండదండలతో ప్రహరీ గోడను నిర్మించే ప్రయత్నం చేసిన ఘటన శనివారం రోజు ఉదయం 11 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో 14 వ వార్డు అంబేద్కర్ కాలనీలో చోటుచేసుకుంది. అదే కాలనికి నివాసముంటున్న లండం చెన్నకేశవులు తండ్రి బాబయ్య అనే వ్యక్తి, పాదచారులకు, వాహన దారులకు, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం సీసీ రోడ్డు వేయించింది. సీసీ రోడ్డు పక్కనే చెన్నకేశవులు నివాసం వుండడంతో సీసీ రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాడు, అది గమనించిన చుట్టు ప్రక్కల గృహస్థులు సీసీ రోడ్డుపై ఎలా నిర్మాణం చేపడతావని అతడిని ప్రశ్నించి ఆపై ప్రభుత్వ ఆస్తిని కాపాడి కబ్జా చేయాలని చూసిన వ్యక్తిపై మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు గోరటి చెన్నకేశవులు, నిరటి రాజు, ఎనుమల్ల రమేష్, మల్లయ్య, నర్సింహ, చంద్రకళ, విజయ, సుగుణమ్మ, వీరయ్య, శశి కుమార్, మహేష్, బాగ్యమ్మ, వెంకటేష్, మల్లయ్య, అంబేద్కర్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment