బోధన్ రూరల్,ఫిబ్రవరి 10:(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బోధన్ పట్టణంలోని శ్రీ విజయ సాయి ఉన్నత పాఠశాలలో శనివారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ ఆట,పాటలతో అందరిలో జోష్ నింపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విరించి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కొంపెల్లి మాధవిలత విద్యార్థులకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థులు శ్రీ రామున్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

తల్లిదండ్రులకు, గురువులకు ఇచ్చిన గౌరవాన్ని వివరించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు. మనకోసం కష్టపడే తల్లిదండ్రులను ఎప్పటికీ మరవద్దని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సూచించిన మంచి మార్గంలో నడిచి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. గత సంవత్సరం 10 వ తరగతి ఫలితాల్లో పది జీపీఏ సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, అకాడమిక్ ఇంచార్జి సువర్చల, ప్రసూన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.