-ముత్యాలమ్మ, పెద్దమ్మ ,సత్తెమ్మ లకు బోనాలు ఎత్తిన భక్తులు
బోనకల్, ఫిబ్రవరి 10(తెలంగాణ ఎక్స్ప్రెస్): మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని రామాలయ ప్రతిష్ట వార్షికోత్సవాల కార్యక్రమాన్ని భక్తులు తెల్లవారుజామున 5 గంటల నుండి భక్తిశ్రద్ధలతో, సీత సమేత రాముడికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొన్నారు.అదేవిధంగా గ్రామంలోని అదే రోజు ప్రతిష్ట గావించబడ్డ గ్రామ దేవతలు ముత్యాలమ్మ పెద్దమ్మ సత్తెమ్మలకు, గ్రామ బొడ్రాయికి, భక్తులు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తి మొక్కులు చెల్లించారు. పిల్లలు పెద్దలు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కిలారు రామకోటేశ్వరరావు, ఆలయ కమిటీ, పురోహితుడు మేడేపల్లి రామకోటయ్య చారి, కిలారు రవి, శ్రీనివాసచారి, ఈదర వెంకటేశ్వర్లు, పెద్దప్రోలు మురళి, సర్పంచ్ నన్నక లక్ష్మి, కిలారు పండు, ఉపసర్పంచ్ గుడ్డురి ఉమా తదితరులు పాల్గొన్నారు.