కామారెడ్డి జిల్లా/ బాన్సువాడ నియోజకవర్గం (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఫిబ్రవరి 10
నియోజకవర్గ నాయకులు, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు, అభిమానులతో కలిసి జన్మధినాన్ని జరుపుకున్న పోచారం .
ముందుగా తన పుట్టినరోజును పురస్కరించుకుని మొక్కలను నాటిన పోచారం .
తరువాత నస్రుల్లాబాద్ మండలం నెమ్లి సాయి బాబా మందిరాన్ని సందర్శించి పూజలు చేశారు.
తరువాత ఇష్ట దైవం బీర్కూరు మండలం తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా పోచారం ని అక్షింతలతో ఆశీర్వదించిన పండితులు.
అనంతరం వర్ని మండలం జలాల్ పూర్ గ్రామంలో పి ఎస్ ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.

అనంతరం వర్ని మండల కేంద్రంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు.
తదుపరి బాన్సువాడ పట్టణంలోని తన నివాసం వద్ద స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన బారీ కేక్ ను కట్ చేశారు.
ఈసందర్భంగా పిఎస్ఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన రక్తధాన శిభిరాన్ని ప్రారంభించి, దాతలను అభినందించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు ఈ వేడుకలలో పోచారం వెంట ఉన్నారు.