గ్రామలోని అర్హులందరూ దరఖాస్తు చేసుకునేలా చూడాలి…
ఘట్కేసర్,ఫిబ్రవరి10(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో పీఎం విశ్వకర్మ యోజన దరఖాస్తు సెంటర్ ను మేడ్చల్ కాంటెస్ట్ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఘట్కేసర్ మండలం ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సంప్రదాయ చేతివృత్తిదారులు, హస్తకళాకారులకు శిక్షణ,నైపుణ్యం,ఆర్థిక సహకారం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వీలుకల్పించే పీఎం విశ్వకర్మ యోజనపై పెద్దఎత్తున అవగాహన కల్పించి,పథకాన్ని వినియోగించుకునేందుకు అర్హులందరు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
18 కేటగిరీలకు చెందిన అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కావేరి మచ్చేందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సునీత, నాయకులు మచ్చేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అజయ్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…