Home తాజా వార్తలు శ్లోక పాఠశాల లో ఘనంగా విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవం

శ్లోక పాఠశాల లో ఘనంగా విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవం

by Telangana Express

మిర్యాలగూడ డివిజన్ ఫిబ్రవరి 10 తెలంగాణ ఎక్స్ ప్రెస్: పట్టణం లోనీ “శ్లోక” పాఠశాల లో విద్యార్థుల స్వపరిపాలన దినోత్సవం వైభవంగా, వినూత్నంగా ,ఘనం గా నిర్వహించారని పాఠశాల కరస్ 12 మారుతి అమరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 60 మంది,విద్యార్దులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రిగా వి.హర్షవర్ధన్ , ఆర్థికశాఖ మంత్రిగా డి .అఖిల్ , యం. ఏల్. ఏ . గా ప్రణీత్ , జిల్లా కలెక్టర్ గా కె .కావ్యాoజలి , జాయింట్ కలెక్టర్ గా జి . జ్యోష్ణ , జిల్లా విద్యాశాఖాధికారి గా డి. మనోజ్ , యం. ఈ. ఓ గా కె.సాత్విక్ , కరెస్పాండెంట్ గా రిష్వీక్ , డైరెక్టర్ గా ఏ. హరీష్ , ప్రిన్సిపల్ గా సంజిత్ రాజు ఉన్నతాధికారులుగా , సుమారు 45 మంది ఉపాధ్యాయులుగా పాత్రల ను ధరించి సృజనాత్మకంగా, వినూత్నంగా గా స్వ పరిపాలనా దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు గా పాత్రలను పోషించిన విద్యార్దులు ప్రతిభావంతంగా బోధించి అందరినీ ఆకట్టుకున్నారు.ఉన్నతాధికారులు గా పాత్రలను పోషించిన విద్యార్దిని ,విద్యార్దులు ఆ పాత్రల కు తగ్గట్టు గా హుందాగా ,అధికారులు గా భాద్యతలను ,అధికారాన్ని అవగాహన చేసుకొని వాటిని పోషించారు.పాఠశాల మొత్తం ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా విద్యార్థులు పోషించారన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment