Home తాజా వార్తలు అయ్యప్ప ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలకు తీర్మానం

అయ్యప్ప ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలకు తీర్మానం

by V.Rajendernath

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో ఈనెల 14వ తేదీ వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కమిటీ తీర్మానించింది. శనివారం కమిటీ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి వి.రాజేందర్ నాథ్ ఆదాయ, వ్యయాలు చదివి వినిపించారు. ఆలయ శాశ్వత కమిటీ సభ్యత్వ రుసుము 18000రూపాయలుగా నిర్ణయించి తీర్మానించారు. అలాగే ఆలయ నిర్మాణం ప్రారంభం నుండి 18000రూపాయల కంటే ఎక్కువ శాతంలో చందాలు అందించిన ప్రతి సభ్యుడు శాశ్వత సభ్యులుగా పరిగనింప బడతారని తీర్మానించారు. ఆలయం చుట్టూ బండల పనులు త్వరితంగా పూర్తయ్యేలా కమిటీ చూస్తామన్నారు. ఆలయం వద్ద బాత్ రూమ్ ల నిర్మాణం చేపట్టాలని సభ్యులు కోరారు. ఈ సమావేశంలో కమిటీ గౌరవ అధ్యక్షులు ముదిగొండ చంద్రం, ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, కోశాధికారి ఈశ్వర్
గౌడ్, సభ్యులు ప్రశాంత్ గౌడ్, ఓర భీమయ్యా, మురళి, నాగం సాయిబాబా, నవీన్, భూపాల్ పంతులు శ్రీనివాస్ రావు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment