అందుబాటులో లేని సిబ్బంది,
మెడికల్ ఆఫీసర్ పై తీవ్ర ఆగ్రహం…
కరీంనగర్/వీణవంక, ఫిబ్రవరి 8 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. చల్లూరు గ్రామంలో అధునాతన పద్ధతులతో చుట్టుపక్క గ్రామాల పేద ప్రజలకు 24 గంటల వైద్యం పేరుతో, ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో, అధునాతన వైద్య పరీక్షలు చేసేందుకు వీలుగా, సిబ్బందిని ఏర్పాటు చేస్తే, ఉత్తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా అవార్డు పొందిన ఘనత ఉన్న చల్లూరు పిహెచ్సిలో గురువారం పాలనాధికారి తనిఖీ కి వెళ్లే సమయానికి, చిత్రంగా స్టాఫ్ నర్స్ హారిక, ఆయా మాత్రమే ఉండడంతో, చల్లూరు మెడికల్ ఆఫీసర్ పై జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అవుట్ పేషెంట్ రిజిస్టర్ తనిఖీ చేశారు.24 గంటలు పీహెచ్సీలో రోగులకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది ఎందుకు లేరని, చల్లూరు పిఎస్సి ఇంత అధ్వానంగా ఎందుకు మారిందో, సిబ్బంది లేకపోవడానికి కారణాలతో కూడిన సమాధానం ఇవ్వాలని, మెడికల్ ఆఫీసర్ నిర్లక్ష్యానికి వివరణ ఇవ్వాలని ను కోరారు.
