శాలువాతో సన్మానించిన గ్రామస్తులు, జి పి సిబ్బంది..
నిత్యం ప్రజా సేవలో ఉంటా…
ఆపదలో అండగా నిలుస్తా…
మాజీ సర్పంచ్ బండారు ముత్తయ్య…
కిష్టంపేట గ్రామ పాలకవర్గం సభ్యులు ..
వీణవంక, ఫిబ్రవరి 7( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచ్ పదవి కాలం జనవరి 31న ముగిసిన సందర్భంగా, బుధవారం పాలకవర్గానికి, సిబ్బందికి గ్రామ బండారు ముత్తయ్య ను ఘనంగా సన్మానించారు.అనంతరం సర్పంచ్ ముత్తయ్య ను పాలకవర్గం గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు.అనంతరం మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాల నుండి గ్రామ అభివృద్ధి కి సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి, సిబ్బందికి,ప్రజా ప్రతి నిధులకు, అధికారులకు,ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి తో గ్రామ గ్రామాన పంచాయతీ భవనాలు,గ్రామానికి ట్రాక్టర్,ప్రకృతి వనాలు,విద్యుత్ దీపాలు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు, నర్సరీలు ఏర్పాటుతో, మన గ్రామం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి పనులకు సహకరించారని, గ్రామంలో ప్రతి వాడకి వీధి దీపాలతో పాటు డ్రైనేజీ, సిసి రోడ్లు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక నిర్మించడం జరిగిందని అన్నారు.గ్రామంలోని మిగిలి ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర పనులను మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహాయ సహకారాలతో పూర్తి చేస్తానని, అధికారం ఉన్న లేకున్నా, జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని, గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారు ముత్తయ్య, ఉప సర్పంచ్ శంకరయ్య, మైపాల్ రెడ్డి,స్పెషల్ ఆఫీసర్ శశి కిరణ్మయి,గ్రామ సెక్రెటరీ కృపారాణి , వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.