ఏకగ్రీవంగా రెండోవసరి ఎన్నిక
రేగోడు ఫిబ్రవరి 7 తెలంగాణ ఎక్స్ ప్రెస్
రేగోడు మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సభ్యులందరూ కలిసి బుధవారం ఎన్నికలు నిర్వహించారు. సభ్యులందరి ఆమోదం మేరకు ఏకగ్రీవంగా రెండవసారి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా శంకర్ గౌడ్ ను ఎన్నుకున్నారు. గౌరవ ఆధ్యక్షులు గా విట్టల్ రావు, ఉప అధ్యక్షులు చంద్ర మోహన్,షఫీ ప్రధానకార్యదర్శిగా సుభాష్, సమాచార కార్యదర్శిగా పూర్ణచందర్, కోశాధికారిగా ముబీన్ , ప్రచార కార్యదర్శి ప్రసాద్, సహాయ కార్యదర్శులుగా నాగభూషణం, బ్రహ్మ చారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రెండవసారి రేగోడ్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రెస్ మిత్రులందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా విలేకరుల గా పనిచేస్తూ ఇంటి స్థలాలు, ఆరోగ్య భీమా, పిల్లల చదులకొరకై ఉద్యమిస్తామని అన్నారు. కరోన సమయంలో కూడా సేవ కార్యక్రమలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులకు ఎక్సమ్ పాడ్స్, నోటు బుక్స్ పంపిణీ తదితరుల కార్యక్రమలు చేసినట్లుగా గుర్తు చేసారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సంతోష్ సాక్షి, వినయ్, బీ. శంకర్, మతీన్ పాల్గొన్నారు.