జడ్చర్ల,ఫిబ్రవరి 3 : మండలంలోని దేవుని గుట్ట తండా గ్రామపంచాయతీ తాజా మాజీ సర్పంచ్ రాములు నాయక్ ను గ్రామస్తులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామపంచాయతీలో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలలో మంచి పేరును సంపాదించుకున్నారు.ఈ సందర్భంగా శనివారం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామస్తులు స్థానిక సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు.బుజ్జి బాయ్,బాబు,బన్నీ,లక్ష్మి పంచాయతీ సెక్రటరీ ఉదయ్, రోజా రాణి,యాదమ్మ,జ్యోతి, గ్రామ పెద్దలు రామచందర్, శంకర్,వెంకటేష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా మాజీ సర్పంచ్ ను సన్మానించిన గ్రామస్తులు
131
previous post