Home తాజా వార్తలు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ సన్మానం

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్ సన్మానం

by Telangana Express

మంచిర్యాల, ఫిబ్రవరి 03, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జన్నారం మండలం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం పోనకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జక్కు భూమేష్ ను ఘనంగా సన్మానించారు. ఐదు సంవత్సరాల కాలపరిమితి జనవరి 31 నాటికి ముగియడంతో పోనకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్వగృహంలో మంచిర్యాల జిల్లా, జన్నారం మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. పొన్కల్ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో కో- ఆప్షన్ సభ్యునిగా ఐదు సంత్సరాలు గ్రామ పంచాయితీ కమిటీ కి అందుబాటులో వుండి పనిచేసిన జన్నారం మండల మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి లెక్కల మల్లయ్య ను, మండల మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇది గ్రామపంచాయతీలో కో-ఆప్షన్ సభ్యునిగా వుండి పొనకల్ గ్రామానికి మరిన్ని సేవలు అందించాలని మండలం మున్నూరు కాపు సంఘ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment