మిర్యాలగూడ ఫిబ్రవరి 3 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతి హాస్పిటల్ వద్దగల భారత్ హై స్కూల్ (ఇంగ్లీష్ మీడియం) లో శనివారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవంనిర్వహించారు. విద్యార్థినీ, విద్యార్థులు ఉపాధ్యాయులుగా అధికారులుగా ప్రజాప్రతినిధులుగా తమ పాత్రను అత్యుత్తమగా వ్యవహరించి కరస్పాండెంట్ మొహమ్మద్ ఖాన్ డీన్ చాందిని మేడం ప్రశంసలు పొందారు. ఉపాధ్యాయులుగా విద్యార్థులు చేతిలో పుస్తకాలను పట్టుకొని
తరగతి గదులకు వెళ్లి పాఠ్యాంశాల బోధించిన తీరు ఆకట్టుకుంది. ప్రతి విద్యార్థి విద్యార్థులందరు ఎంతో ఉత్సాహంగా తమ బాధ్యతలను అద్భుతంగా వ్యవహరించారు.భారతదేశం ప్రధానిగా మదార్,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అఫ్రిన్,
నల్లగొండ జిల్లా కలెక్టర్ అఫీఫా,
ప్రతి ఒక్కరు తమ పదవులో ఒదిగిపోయారు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్
ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
