రాజాపూర్,ఫిబ్రవరి 2 తెలంగాణ ఎక్స్ ప్రెస్: ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు రాజాపూర్ ఎంపీడీవో లక్ష్మీదేవి తెలిపారు.శుక్రవారం రాజాపూర్ మండలo లోని ఇది గాని పల్లి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతు ఉపాధి హామీ పథకం నిరుపేదలకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు.ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్ల నిర్మాణాలు చెరువులకు మరమ్మతులు ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.కరువు కాటకాల సమయంలో ఉపాధి హామీ కూలీలకు ఉపాధి చూపిస్తుందని ఉపాధి కూలీలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎపీఓ,సెక్రటరీ,సీనియర్ మెట్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవం
69
previous post