60
కామారెడ్డి, ఫిబ్రవరి 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామంలో ఐదు సంవత్సరాల పదవి కాలం ముగిసిన పంచాయతీ పాలకవర్గానికి గ్రామపంచాయతీ సెక్రటరీ సౌమ్య, కారోబార్ చంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ మంజుల నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ బాలకిషన్ గౌడ్, వార్డు సభ్యులను సన్మానించారు. ఐదు సంవత్సరాల పదవి కాలంలో పాలకవర్గ సభ్యులు అభివృద్ధి చేసిన పనులను గుర్తు తెచ్చుకున్నారు.