Home తాజా వార్తలు డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇచ్చిన ఏ బీ వి పి కార్యదర్శి చంద్రకాంత్

డిపో మేనేజర్ కి వినతి పత్రం ఇచ్చిన ఏ బీ వి పి కార్యదర్శి చంద్రకాంత్

by Telangana Express

భైంసా మండలం కేంద్రం లో ని
విద్యర్థులకోసం బస్సులు నడపాలి
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ భైంసా శాఖ ఆధ్వర్యంలో భైంసా బస్ డిపో మేనకి వినతిపత్రం అందజేశారు నగర కార్యదర్శి చంద్ర కాంత్ మాట్లాడుతూ_విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళాలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. విద్యార్థులు ఎన్నో సమస్యలను ఎదుర్కో వడం జరుగుతుంది. బస్సులు సమయానికి రాక కళాశాల మరియు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా సమయాన్ని మించి ప్రయాణం చేస్తున్నారని దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కళాశాల నుండి తిరిగి ఇంటికి వెళ్ళడానికి దాదాపు రాత్రి 9 గంటల సమయం పడుతుంది.దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కళాశాల విద్యార్థులకు ఉదయం సాయంత్రం అదనపు బస్సులను కేటాయించలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని యెడల రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమలు చేస్తామని హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమం లో జిల్లా కన్వీనర్ శశి, విభాగ్ ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ చంద్రగిరి శివ కుమార్,ప్రకాష్, తదితులు పాల్గొన్నారు..

You may also like

Leave a Comment