ఎంసీపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 02(తెలంగాణ ఎక్సప్రెస్ న్యూస్ ):
దేశం అభివృద్ధి చెందుతదన్న పేరుతో పార్లమెంట్లో బిజెపి ప్రభుత్వం కల్పిత కథలతో మద్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్ ఆరోపించారు. శుక్రవారం మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ లో గల ఎంసిపిఐ(యు) కార్యాలయం నుండి ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర బడ్జెట్ గా బిజెపి ప్రభుత్వం పార్లమెంట్లో 47,65,768 కోట్ల రూపాయలతో దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని, ఈ బడ్జెట్ లో దేశ అభివృద్ధి కాకుండా వివిధ రంగాల కేటాయించిన నిధులు కల్పిత కథలతో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు బడ్జెట్ భారీగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని,రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, 2022 నాటికే గృహ నిర్మాణాలు చేస్తామని,100 స్మార్ట్ సీట్లను దేశంలో నిర్మిస్తామని అనేక ప్రకల్బలు పలికిందని అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన గత హామీలను నెరవేర్చకుండా ఈ 2024-25 బడ్జెట్ తో దేశానికి న్యాయం చేశామన్న తరహాలో ప్రవేశపెట్టి దేశ సంపదను గతంలాగానే కార్పొరేట్ శక్తులను పెంచి పోషించే విధంగా ఆయా పెట్టుబడిదారీ రంగాలకు భారీ నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం దేశ అభివృద్ధి కన్నా పెట్టుబడిదారీ కార్పొరేట్ శక్తులను అభివృద్ధి చేయడమే ప్రధానంగా పనిచేస్తుందని అన్నారు. రేపటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అనే పేరుతో కల్పిత కథలతో కూడిన ఈ బడ్జెట్ ఉందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధిలో సమూలమైన మార్పు కోసం శాస్త్రీయమైన దృష్టితో ఉచిత విద్య,వైద్య రంగాల అభివృద్ధికి, సామాజిక అవసరాలకు, శ్రామిక వర్గ, పేదల అభివృద్ధికి ఈ బడ్జెట్ ను సరిచేయాలని డిమాండ్ చేశారు.