Home తాజా వార్తలు జంతు సంక్షేమ సంరక్షణ కార్యక్రమం నిర్వహించిన పశువైద్యాధికారి శ్రీకాంత్

జంతు సంక్షేమ సంరక్షణ కార్యక్రమం నిర్వహించిన పశువైద్యాధికారి శ్రీకాంత్

by Telangana Express

మంచిర్యాల, జనవరి 30, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జంతు సంక్షేమ సంరక్షణ పక్షోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం జన్నారం మండల పశువైద్యాధికారి శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని పెంపుడు జంతువులు, పక్షులు, వన్య ప్రాణులు, పాడి పశువులు, మూగ జీవాలు పట్ల జాలి, కరుణ, దయ కలిగి ఉండాలన్నారు. మూగజీవులను కాపాడే ఉద్దేశ్యంతో వాటి పట్ల ప్రజల ప్రవర్తన, భాధ్యత, సంరక్షణ గురించి తెలియ చేశారు. జంతు ప్రేమికులకు పెంపుడు జంతువులు వాటికి వొచ్చే వ్యాధులు వాటి వలన మనుషులకు సంక్రమించే వ్యాధులు గురించి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఉచితంగా యాంటీ రేబీస్ వాక్సినేషన్ వైద్య శిబిరాన్ని జన్నారం ప్రాథమిక పశు వైద్య కేంద్రములో నిర్వహించారు. ఆ మండల పశు వైద్య శిబిరంలో 126 పెంపుడు జంతువులకు యాంటీ బయటిక్ టీకాలు పశువైద్యాధికారి వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన్నారం మండల పశు వైద్య పశు సంవర్ధక శాఖా అధికారి, శ్రీకాంత్ పశు వైద్యాధికారి కార్యాలయం సిబ్బంది, జంతు ప్రేమికులు, పెంపుడు జంతువుల యజమానులు, పాల్గొన్నారు.

You may also like

Leave a Comment