Home తాజా వార్తలు పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం కావాలికాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశం

పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధం కావాలికాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజ్గిరి మహిళా కార్యవర్గ సమావేశం

by Telangana Express

( తెలంగాణ ఎక్స్ ప్రెస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 29 )

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం విన్ ప్యాలస్ లో జరిగిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ళ లక్ష్మి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ లో నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి , కూకట్ పల్లి నియోజకవర్గాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండి రమేష్, కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులు సత్యం శ్రీరంగం , మరియు జిల్లా లోని ముఖ్య నాయకులతో పాటు కలిసి హాజరయ్యారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంలో మహిళా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని వారి పాత్ర మరువలేనిదని, అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కష్టపడి పనిచేసి టిపిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అత్యధిక పార్లమెంట్ నియోజకవర్గాలను గెలిపించుకుని ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గా చేసుకుని దేశంలో కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకుని రావడంలో మహిళా సోదరీమణులు విశేష కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ కూడా మహిళా కాంగ్రెస్ లో కష్టపడి పనిచేసిన సోదరీమణులకు సముచిత స్థానం కల్పిస్తుందని దానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా నావంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో వీరితోపాటు టిపిసిసి జనరల్ సెక్రటరీ సొంఠిరెడ్డి పున్నా రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా నాయకులు శ్రావణ్ కుమార్, జేమ్స్ మరియు జిల్లా లోని అన్ని బ్లాక్ ,మండల, మున్సిపల్, కార్పొరేషన్, డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్ళు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment