కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ ట్రస్ట్ కబడ్డీ టోర్నమెంట్ కు కేటీఆర్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించిన కాసాని వీరేష్ ముదిరాజ్
(తెలంగాణ ఎక్స్ ప్రెస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి 29)
కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే 49వ జూనియర్ నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ ఫిబ్రవరి 1 న బాచుపల్లి కౌసల్య గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ప్రారంభం కానున్న సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ను కలిసి టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని కోరుతూ ఆహ్వాన పత్రిక అందజేసిన అమెచ్యార్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్
ఈ ఆహ్వాన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద , ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, చేవళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి , అమెచ్యార్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు కాసాని వీరేష్ ముదిరాజ్ లు కేటీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది.
కాసాని కౌసల్య ముదిరాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే నేషనల్ కబడ్డీ టోర్నమెంట్ ఫిబ్రవరి 1న ప్రారంభమై పిబ్రవరి 4వ తారీఖు వరకు కొనసాగుతుంది
రాష్ట్ర నలుమూలల నుండి పెద్దఎత్తున పోటీ పడడనికి టీమ్ లు రానున్న ఈ సందర్భంలో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది కాసాని విరేశ్ ముదిరాజ్ తెలియజేశారు