Home తాజా వార్తలు ఫార్మసీ రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా కీర్తిప్రతిష్టలను పొందిన అనురాగ్ విశ్వవిద్యాలయం

ఫార్మసీ రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా కీర్తిప్రతిష్టలను పొందిన అనురాగ్ విశ్వవిద్యాలయం

by Telangana Express

ఘట్కేసర్,జనవరి 27(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )గత కొన్నేళ్లుగా నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ పూర్తి అంకిత భావంతో భావి తరాల భవిష్యత్తుకు మంచి పునాది వేస్తున్న విద్యాసంస్థగా ఎంతో కీర్తిప్రతిష్టలను పొందిన అనురాగ్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైన ర్యాకింగ్‌లను సాధించి తన ఇంజనీరింగ్, ఫార్మసీ రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా నిలుస్తోంది.


అనురాగ్ విశ్వ విద్యాలయం అందిస్తున్న అర్హత కలిగిన అన్ని కోర్సులు / ప్రోగ్రామ్‌లు NBA , NACC అక్రిడేషన్ పొందడం విశేషం.100 ఎకరాలువిస్తీర్ణంలో, 10 లక్షల చదరవు అడుగుల్లో సువిశాలమైన విస్తీర్ణంలో అత్యుత్తుమ విద్యాప్రమాణాలతో కూడిన అతి పెద్ద ఉన్నత విశ్వ విద్యాలయంగా అనురాగ్ యూనివర్సిటీ తన ప్రత్యేకతను చాటుకుంటోంది..యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులకు 100 శాతం అత్యాధునిక బోధనా, వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తోంది. దాదాపు 200 మంది డాక్టరేట్స్ పొందిన 500 మంది అత్యుత్తమ ఫ్యాకల్టీ మార్గదర్శకత్వంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ 2023-24 విద్యా సంవత్సరంలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ అకాడమీగా అనురాగ్ యూనివర్సిటీ నిలిచింది.
అనురాగ్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులు : B.టెక్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ కోర్సు – నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఎన్ బి ఏ నుండి 6 సంవత్సరాల గుర్తింపు ఇతర బీటెక్ కోర్సులు -నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (NBA) నుండి 3 సంవత్సరాల గుర్తింపు ఈ మేరకు అనురాగ్ సెట్ -2024 ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌తో విడుదల చేశారు. అనురాగ్‌సెట్ 2024 లో నిలిచే టాపర్‌లకు రూ.6.5 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు కూడా ప్రకటించారు అనురాగసెట్- 2024 లో ర్యాంకులు పొందిన విద్యార్థులకు అందిస్తున్న స్కాలర్‌‌షిప్‌ల వివరాసీఈఓసి అనురాగ్ సెట్‌లో 1 నుంచి 10 ర్యాంకులు పొందిన విద్యార్థిని, విద్యార్థులకు 100 శాతం కన్సెషన్‌తో ఒక్కొక్కరికి రూ. 11 లక్షల 40 వేల రూపాయలు స్కాలర్‌‌షిప్‌గా అందిస్తామని అనురాగ్ యూనివర్సిటీ బంపరాఫర్ ఎన్ బి ఏ కటించింది. అలాగే 11 నుంచి 25 ర్యాంకులు పొందే వారికి 50 శాతం కన్సెషన్‌తో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల 70 వేల రూపాయలు స్కాలర్‌‌షిప్‌గా ప్రకటించింది.ఇక 26-100 ర్యాంకులు పొందే వారికి 25 శాతం కన్సెషన్‌తో ఒక్కొక్కరికి రూ. 2 లక్షల 85 వేల రూపాయలు స్కాలర్‌షిప్ అందిస్తామని యూనివర్సిటీ రిజిష్ట్రార్ తెలిపారు.అలాగే EAPCETలో 1 నుంచి 10 వేల ర్యాంకులు, జె ఈ ఈ లో 1 నుంచి 50 వేల లోపు ర్యాంకులు పొందే విద్యార్థిని, విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల 70 వేలు స్కాలర్‌షిప్‌గా అందిస్తామని అనురాగ్ యూనివర్సిటీ ప్రకటించింది. అలాగే EAPCET 10 వేల నుంచి 15 వేల లోపు ర్యాంకులు పొందే వారికి , జేఈఈ లో 50 వేల నుంచి 75 వేల లోపు ర్యాంకులు పొందేవాళ్లకు 25 శాతం రాయితీతో రూ. 2 లక్షల 85 వేలు స్కాలర్‌షిప్‌గా అందిస్తామని, EAPCET 15 వేల నుంచి 25 లోపు ర్యాంకులు పొందేవారికి, జీఈఈలో 75 వేల నుంచి లక్షలోపు ర్యాంకులు పొందేవారికి 10 శాతం రాయితీతో రూ. 1 లక్షా 40 వేలు స్కాలర్‌షిప్‌గా అందిస్తామని అనురాగ్ యూనివర్సిటీ ప్రకటించింది. 75% కంటే ఎక్కువ 10+2 స్కోర్‌లతో అనురాగ్‌సెట్ ద్వారా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన మొదటి 500 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహుమతిగా ఇవ్వబడతాయి. అన్ని స్కాలర్‌షిప్‌లు అర్హత ప్రమాణాలు, ఇతర నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయని యాజమాన్యం తెలిపింది.ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు EAPCET‌ లో 20000 ర్యాంకుల వరకు పొందిన విద్యార్థులకు 50% ట్యూషన్ ఫీజు మినహాయింపు, మెరిట్ స్కాలర్‌షిప్ అందిస్తామని అనురాగ్ యాజమాన్యం ప్రకటించింది. ఇక అనురాగ్ విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరంలో స్పోర్ట్స్ కోటాలో అడ్మిషన్లు పొందే విద్యార్థులకు ట్యూషన్ ఫీజులో 100% వరకు రాయితీతో కూడిన స్కాలర్‌షిప్‌లను అందించింది. అలాగే రాబోయే విద్యా సంవత్సరానికి ఎన్‌సిసి, ఇతర పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో కూడా అడ్మిషన్లు పొందే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించాలని నిర్ణయించినట్లు అనురాగ్ యూనివర్సిటీ రిజిష్ట్రార్ తెలిపార. ఈ ప్రెస్‌మీట్‌లో ప్రొ.బాలాజీ ఉట్ల – రిజిస్ట్రార్, శ్రీమతి.ఎస్.నీలిమ – సీఈఓ పిఆర్ఓ .V.విజయ కుమార్–డీన్, ఇంజనీరింగ్ స్కూల్, Dr.మహీపతి శ్రీనివాస్ రావు – డైరెక్టర్, అడ్మిషన్స్ డైరెక్టరేట్, డీన్లు, డైరెక్టర్లు మరియు అన్ని విభాగాల అధిపతులు లో పాల్గొన్నారు..

You may also like

Leave a Comment