Home తాజా వార్తలు శాసనమండలి సభ్యున్ని కలిసిన టీజేఏ ప్రతినిధులు

శాసనమండలి సభ్యున్ని కలిసిన టీజేఏ ప్రతినిధులు

by V.Rajendernath

హైదరాబాద్, జనవరి 27:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)

రాష్ట్ర గవర్నర్ శాసన మండలి సభ్యుడిగా నియామకం అయిన సియాసత్ ఉర్దూ దిన పత్రిక సంపాదకులు అమీర్ అలీ ఖాన్ ను శనివారం తెలంగాణ జర్నలిస్ర్ అసోసియేషన్(టీజేఏ, అనుబంధ సంస్థ అయిన తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్ లోని అబిడ్స్ లో గల సియాసత్ కార్యాలయం లో కలిసి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. భవిష్యత్ లో మంత్రివర్గం విస్తరణలో అవకాశము రావాలని ఆశిస్తూ అభినందనలు తెలిపారు. ఈకార్యక్రమంలో టీజేఏ ఫౌండర్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ఖాసీం, ఆర్గనైజషన్ సెక్రటరీ ఘోరీ, కోశాధికారి ఖలీల్, ఇక్రాముల్లా, భక్రి, హాసద్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment