ప్రతిమ ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరన్న…
వీణవంక, జనవరి 27( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి )
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లో డిఆర్డిఏ, ఐకెపి కార్యాలయం లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీణ వంక మండలం ప్రతిమ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ గాజంగి వీరన్న మాట్లాడుతూ… యువకులకు ఉచిత ఉపాధి హామీ పథకం క్రింద సోలార్, ఏసీమెకానిక్,ఎలక్ట్రీషియన్,కుట్టుమిషన్, బ్యాంకింగ్ కోర్స్,18నుండి 30సంవత్సరాల యవతి యువకులకు అవకాశం వుందని చెప్పారు. మరియు ఉచిత కంటి ఆపరేషన్లు, హెర్నియా, హైద్రోసిల్, గర్బ సంచిఆపరేషన్లు,చేయబడును, మరియు ప్రతిమ హస్పటల్ ఉచిత బస్సు సౌకర్యం ప్రతి గురువారం వుంది అని చెప్పడం జరిగింది. ప్రతిమ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం పేదవారికి ఉచిత ఉపాధి మరియు ఉచిత వైద్యం కల్పించడం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రతిమ హాస్పటల్ హెచ్ ఓ డి కౌశిక్ , జాకీర్ మరియు ఏపీఎం కొమరయ్య , ఆనంద్ సీసీ లు, వీవోలు లు పాల్గొనడం జరిగింది. ఈ కోర్సులకు సంబంధించి వివరాల కోసం 9959903097 మొబైల్ నంబర్ కు సంప్రదించాలని కోరారు.