మిర్యాలగూడ జనవరి 27 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కాంగ్రెస్ పార్టీ (రాజీవ్ భవన్)కార్యాలయంలో మాజీ సైనికుడు, మాజీ స్వాతంత్ర సమరయోధుడు, మిర్యాలగూడ మాజీ సర్పంచ్,
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరునగరు గంగాధర్ నాలుగో వర్ధంతిని
పురస్కరించుకొని గంగాధర్ చిత్రపటానికి, రౌండ్ వద్ద గల గంగాధర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గాయం ఉపేందర్ రెడ్డి, టీపీసీసీ మాజీ సభ్యులు రామ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ తిరునగరు గంగాధర్ చాలా క్రమశిక్షణతో మిలటరీ పనిచేసి రిటైర్డ్ వరకు కొనసాగి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం క్రమశిక్షణ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని, గంగాధర్ సేవలను కొనియాడారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటమే ఆయన ఆశయమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇనాయత్ ఖాన్, పైడిమర్రి నరసింహారావు, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు పొదిల వెంకన్న, ఎంపీటీసీలు వంకాయలపాటి చలపతిరావు, ఇజ్రాయిల్, డిసిసిబి మాజీ డైరెక్టర్ సజ్జల రవీందర్ రెడ్డి, ఓబీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ మెరుగు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆవుల బక్కా రెడ్డి, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు జానపాటి రవి ,పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నీరుకంటి నారాయణ, ఐ ఎన్ టి సి పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాలేమియ్య, జెల్లా వెంకటేశ్వర్లు, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలగానే వెంకటేష్ గౌడ్, ఓబీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కోట శ్రీనివాస్, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు కుక్కల సురేష్ ,చేకూరి కోటేశ్వరరావు, పోలిశెట్టి అజయ్ కుమార్ ,దుండిగాల సతీష్ కుమార్, మోహన్ వెంకటేశ్వర్లు అజయ్ రవికుమార్ శ్రీను అశోక్ తదితరులు పాల్గొన్నారు.