Home తాజా వార్తలు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

by Telangana Express

జుక్కల్ జనవరి 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్ గల్ మండలంలో శనివారం నాడు సర్వసభ్య సమావేశంలో
పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు . పాల్గొన్నారు
సమావేశంలో ఎమ్మెల్యే అనంతరం గ్రామ ప్రజలు నాయకులు ఎమ్మెల్యేకు శాలువతో సత్కరించారు అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమస్యలు గురించి చర్చించారు.
అగ్రికల్చర్ ఆఫీసర్ తో మాట్లాడుతూ వ్యవసాయనికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకోవటం జరిగింది..


అదేవిధంగా ఎమ్మార్వో గారు ఎమ్మెల్యే గారితో 464 సర్వే నెంబర్ కి చెందిన ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించిన సమస్యల పై మాట్లాడటం జరిగింది.
గ్రామాలలోని స్కూల్స్ ని పట్టించుకోవట్లేదని ఎం ఈ ఓ దేవీసింగ్ పైన పలువురు పిర్యాదు చేయగా ఎమ్మెల్యే గారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్కూల్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎమ్మారో దశరథ్ గారు,ఎంపీపీ ప్రతాపరెడ్డి గారు, ఎంపిడిఓ పి. రాణి గారు, ఎంపిఓ ఎం.సూర్యకాంత్ గారు, కో- ఆప్షన్ మెంబెర్ జాఫర్ గారు, PACS ఛైర్మెన్ హన్మంత్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.
సభ అనంతరం గ్రామ ప్రజలు, నాయకులు ఎమ్మెల్యేకు శాలువతో సత్కరించారు.

You may also like

Leave a Comment