బిచ్కుంద జనవరి 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
గణతంత్ర దినోత్సవం సందర్బంగా బిచ్కుంద కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీచౌక్ లో జాతీయ జెండాను ఎగురావేశారు కానీ దింపడం మర్చిపోయారు.ఆవిష్కరణ చేసిన జాతీయపతాకాన్నినిర్లక్ష్యంగా (శుక్రవారం వదిలివేయడంతో ఒక రోజంతా అలాగే ఉంచి నేడు (శనివారం) ఉదయం 7:30 గంటలకు జాతీయ జెండాను దింపడంపట్ల పలువురు తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తితో చూడాల్సిన జాతీయ జెండాను అవమాన పర్చిన కిరాణా అసోసియేషన్ సభ్యులపై కఠిన చర్యలు
తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.