Home తాజా వార్తలు 19 వ సారి ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సయీద్ మస్రూర్ అహ్మద్

19 వ సారి ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సయీద్ మస్రూర్ అహ్మద్

by V.Rajendernath

కామారెడ్డి, జనవరి 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ డి ఎ ఓ గా విధులు నిర్వహిస్తున్న ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సయీద్ మస్రూర్ అహ్మద్ 19వ శరీ ఉత్తమ ఉద్యోగిగా అవార్డు అందుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం అవరణలో జరిగిన 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తమ ఉద్యోగిగా అవార్డును జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫెదార్ శోభ రాజు, జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా అందుకున్నారు. ఉత్తమ అవార్డు అందుకోవడం పట్ల సహ ఉద్యోగులు, తోటి స్నేహితులు, వ్యాపార వేత్తలు, అభినందనలు తెలిపారు. జుక్కల్ లో టైపిస్టు గా చేరిన సయీద్ ఈరోజు కలెక్టరేట్ లో డిఎఓ గా విధులు నిర్వహిస్తున్నారు.

You may also like

Leave a Comment