Home తాజా వార్తలు కంబాలపల్లి వెంకటయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

కంబాలపల్లి వెంకటయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

by Telangana Express
  • ఆమనగల్లు మండల యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి

ఆమనగల్లు, జనవరి 25
(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని ఆకుతోటపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికురాలు కంబాలపల్లి ఇందిరమ్మ భర్త వెంకటయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. ఈ విషయం గ్రామ మాజీ సర్పంచ్ రామచంద్రయ్య ద్వారా తెలుసుకున్న యువ నాయకులు న్యాలపట్ల నరేందర్ రెడ్డి వెంకటయ్య మృతి సంతాపం తెలుపుతూ ఆయన సమకూర్చిన 5 వెల రూపాయల ఆర్థిక సహాయాన్ని మాజీ సర్పంచ్ రామచంద్రయ్య వార్డు సభ్యుడు కంబాలపల్లి బాలు మరియు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఇందిరమ్మకు అందజేశారు.

You may also like

Leave a Comment