మంచిర్యాల, జనవరి 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): బీహార్ మాజీ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణ (మంగలి) కులానికి చెందిన కర్పూరి ఠాకూర్ 100వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించారు. బుధవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండల కేంద్రంలో మండల నాయీబ్రహ్మణ సేవా సంఘం కార్యాలయం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కస్తులపూరి నాగేందర్, మర్రిపల్లి శేఖర్, అధ్యక్షతన బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ కే ఏ నర్సింహులు మాట్లాడుతూ కర్పూరీ ఠాకూర్ చిన్ననాటి నుండి విప్లవ భావాలు ఎక్కువ అనీ కాలేజీ విద్యను మద్యలోనే వదిలేసి, భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారనీ, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటీష్ ప్రభుత్వం ఠాకూర్ 1942-1945 లో థాణా అరెస్టు చేసి జైల్లో వేసిందనీ, స్వాతంత్ర్య సిద్ధంచాక మొదట్లో గ్రామంలో టీచర్ గా పని చేశారు బీహార్ లో బీసీ లకు 26 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మంగేరీ లాల్ కమీషన్ సిఫారసులను 1978 లో అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు, బీసీ కులాల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పురి ఠాకూర్ 100 జయంతి వేడుకలు
46
previous post