ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
మంచిర్యాల,వజనవరి 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్) : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండలంలోని ఇందన్ పల్లి, కవ్వాల్, జన్నారం గ్రామాలలో గ్రామ పంచాయతీ నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిందనీ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందె విధంగా కృషి చేస్తామన్నారు. మునుముందు పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామనీ పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రము అప్పుల పాలయిందని, పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి ప్రజలకు మోసం చేసిందన్నారు. పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.