మేడ్చల్, జనవరి 24:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
మేడ్చల్ పరిధిలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు సిబిఎస్ఈ గుండ్ల పోచమ్మ శాఖ, జాతీయ స్థాయిలో జరిగిన క్యాట్ ఒలంపియాడ్ లెవల్-II లో ప్రతిభను చాటుకున్నదని ఆ సంస్థ ల అకడమిక్ డైరెక్టర్ సీమా, బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 మంది విద్యార్థులు క్యాష్ అవార్డ్ తో పాటు మెడల్, మెరిట్ సర్టిఫికెట్స్ పొందారని,128 మంది విద్యార్థులు
మెడల్ తో పాటు మెరిట్ సర్టిఫికెట్లు, 181 మంది మెరిట్ సర్టిఫికెట్స్ పొందారని, మొత్తం 323 మంది జాతీయ స్థాయి క్యాట్ ఒలింపియాడ్ లెవెల్ లో సత్తా చాటినట్లు ఆమె తెలిపారు. తమ విద్యా సంస్థల ద్వారా మట్టినుండి మాణిక్యాలను వెలికి తీస్తున్న మాదిరిగా విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీస్తుంది అని తెలిపారు. గతసంవత్సరం కంటే ఈ సారి క్యాట్ ఒలింపియాడ్ లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల, కొంపల్లి జోన్ ఎ.జి.యమ్ జి. వి. రమణారావు, హెచ్ ఎం. రాజేష్ రెడ్డి, కోఆర్డినేటర్ జైపాల్ రెడ్డి , డీన్స్ సోమేశ్వర్, అఖిల్ , విద్యార్థులు వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయ బృందాన్ని విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సీమా ప్రత్యేకంగా అభినందించారు.