మంచిర్యాల, జనవరి 24, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామంలో మహిళా గ్రూపు వివో కార్యాలయాన్ని మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్ ప్రారంభించారు. బుధవారం మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ మహిళల కోసం వివో భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతినెల గ్రూప్ సభ్యులు ఈ కార్యాలయంలో తమ సమావేశాన్ని నిర్వహించుకోవచ్చన్నారు. వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు అత్యవసర సమయంలో ఈ వివో భవనాన్ని గ్రామం మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ ను, ఆ గ్రామ వివో గ్రూప్ సభ్యులు గ్రామ మహిళలు, శాలువాతో పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ఏపిఎం బుచ్చన్న, సీసీ దుర్గం శ్రీనివాస్ , కార్యదర్శి లావణ్య వార్డు సభ్యులు చంద్రయ్య రాజన్న జునుగురు లక్ష్మి జాడి వెంకట్, వివో తిమ్మాపూర్ లీడర్ లలిత, వివో సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
వివో భవనాన్ని ప్రారంభించిన మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు జాడి గంగాధర్
59
previous post