చేగుంట జనవరి 24 :—
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చేగుంట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు నీరజ మాట్లాడుతూ ఆడపిల్లలు లేని సమాజాన్ని ఊహించలేమని, ఆడపిల్లలను పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దామని వారు అని, సమాజంలో లింగ వివక్షత నిర్మూలించినప్పుడే సమ సమాజం నిర్మించబడుతుందని,భారతదేశ రాష్ట్రపతి మహిళా అని, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా మహిళా అని, మహిళలు అని రంగాలలో రాణిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని బాలికలు కూడా అన్ని రంగాలలో రాణించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు రాధా, సరస్వతి,శ్రీవాణి, రమ,లలిత, శారద, శ్రుతి విద్యార్థులు పాల్గొన్నారు