Home తాజా వార్తలు ఫిబ్రవరి 5 ,6న బీసీల చలో ఢిల్లీ

ఫిబ్రవరి 5 ,6న బీసీల చలో ఢిల్లీ

by Telangana Express

బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్

మిర్యాలగూడ డివిజన్ జనవరి 23 తెలంగాణ ఎక్స్ ప్రెస్: ఫిబ్రవరి 5,6 తేదీలలో ఢిల్లీ లో జరిగే పార్లమెంటు ముట్టడికి బీసీ లందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని మిర్యాలగూడలో బీసీ యువజన సంఘం సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ భారతదేశ జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు జనాభా కి దగ్గట్లుగా రిజర్వేషన్ లేకపోవడం వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల గడిచినప్పటికీ కూడా బీసీల బ్రతుకులు ఏమాత్రం మారలేదు బీసీ కుల గణన చేయాలి అని చెప్పేసి గత ఎంతో కాలంగా ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంతృత్వ శాఖను ఏర్పాటు చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరు కట్టినట్టుగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి బీసీల డిమాండ్లు సానుకూలంగా స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి బీసీ లందరూ సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు కార్యక్రమంలో … ఆర్లపూడి శ్రీను, చిలకల మురళి యాదవ్, రాయించు నరసింహ, పగిళ్ల అనిల్, నరేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment