Home తాజా వార్తలు ఘట్టుమైసమ్మ జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

ఘట్టుమైసమ్మ జాతర ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం

by Telangana Express

పలు సూచనలు చేసిన మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్…

ఘట్కేసర్,జనవరి 24(తెలంగాణ ఎక్స్ ప్రెస్)మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ కార్యాలయంలో గట్టు మైసమ్మ జాతర ఏర్పాట్ల పై ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ఘట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి,ఈఓ భాగ్య లక్ష్మి,సీఐ మహేందర్ రెడ్డి, కమిషనర్ ఎండీ సాబేర్ అలీ హాజరు కాగా జాతర ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రతల గురుంచి చర్చించారు.


ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 28వ తేదీ ఆదివారం రోజున జరగబోయే శ్రీ శ్రీ శ్రీ గట్టు మైసమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు అదేవిధంగా చుట్టూ పక్కల గ్రామ ప్రజలు, భక్తులు భారీగా తరలివస్తారని, కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ సమస్యలు సైతం తలెత్తకుండా చూడాలని అధికారులకి ప్రత్యేక దర్శన ఏర్పాటు చేయాలని, వరంగల్ హైవే పై వాహనాలకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఘట్కేసర్ విధించాలని కోరారు, అదేవిధంగా మున్సిపల్ పట్టణ ప్రజలు, చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు అందరు కూడా జాతర సందర్భంగా ఆలయ అధికారులకు, పోలీస్ అధికారులకు, సహకరించాలి కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండారు ఆంజనేయులు గౌడ్ గారు, ఎస్ ఐ శేఖర్ , ట్రాఫిక్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు….

You may also like

Leave a Comment