Home తాజా వార్తలు స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం మరువలేనిది

స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం మరువలేనిది

by Telangana Express

…… జాజుల లింగంగౌడ్

మిర్యాలగూడ డివిజన్ జనవరి 23 తెలంగాణ ఎక్స్ ప్రెస్: స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127 వ ‘జయంతి’ సందర్భంగా పట్టణంలోని బీసీ వసతి గృహంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన వారని అన్నారు.ఆయన యొక్క జీవిత చరిత్ర ఎంతోమంది యువతకు స్ఫూర్తి దాయకమన్నారు..దేశంలోనే అత్యున్నత ఉద్యోగం సివిల్ సర్వీస్ ను వదులు కొని దేశం కోసం “ఆజాద్ హిందూ ఫౌజ్” అనే స్వతంత్ర సైన్యాన్ని నడిపాడు.నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అనే నినాదంతో యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించారు.ఇతని మరణం ఇప్పటికి రహస్యం గానే మిగిలిపోయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,జానపాటి రవి, భూపతి నరేష్, కుమ్మరికుంట్ల సుధాకర్ రాంబాబు యాదవ్ గోపి వంశీ శివ మురళి రవితేజ సందీప్ నాగరాజు వంశీ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment