శుభాకాంక్షలు తెలిపిన బ్రాహ్మణపల్లి నాయకులు.
వీణవంక, జనవరి 23( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూర్ వెంకట్ ను , రాష్ట్ర అధినాయకత్వం గుర్తించి, ఎమ్మెల్సీ గా ఏకగ్రీవంగా ఎన్నుకోగా, హుజురాబాద్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విద్యార్థి నేతగా మంచి గుర్తింపు పొందిన బల్మూరు వెంకట్ ను, నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకొని,పూల గుచ్చాలు అందజేస్తూ, శాలువా కప్పుతో ఘనంగా సన్మానిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పల్లి గ్రామ అధ్యక్షులు ఎండి హకీం, మండల రాజయ్య, నాగరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.